ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను జైలు నుంచి బయటకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇండియా కూటమికి మెజారిటీ వస్తే జూన్ 5నే తాను జైలు నుంచి విడుదలవుతానని సోమవారం ఢిల్లీలో జరిగిన ఆప్ కౌన్సిలర్ల సమావేశంలో కేజ్రిీవాల్ అన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రివాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం జూన్ 1 వరకు సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి జూన్ 2న జైల్లో లొంగిపోవాల్సి ఉంది. అయితే జూన్ 1తో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియనుంది. వీటి ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఈ ఫలితాల్లో ఇండియా కూటమికి మెజారిటీ వస్తే తిహార్ జైలు నుండి విడుదలయ్యే అవకాశం వుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.