నక్సల్స్ నిర్మూలనకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్: అమిత్ షా

Published on 

రాయ్‌పూర్‌: రాయ్‌పూర్‌లోని హోటల్ మేఫెయిర్‌లో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర నక్సల్స్ వ్యతిరేక సమీక్ష సమావేశంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. గత 8 నెలల్లో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేసిందని ఆయన అన్నారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నియాద్ నెల్లనార్ పథకం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంత అభివృద్ధికి మైలురాయిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 17 శాఖలకు చెందిన 53 ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, 28 కమ్యూనిటీ పథకాలు అందుబాటులో ఉండేలా చూస్తోందన్నారు.

విష్ణు దేవ్‌సాయి నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గత ఎనిమిది నెలల్లో 147 మంది వామపక్ష తివ్రవాదులను హతమార్చిందని కేంద్ర హోంమంత్రి షా అన్నారు. ఈ కాలంలో 631 మంది వామపక్ష తీవ్రవాదులు లొంగిపోయి తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను మరింత మెరుగ్గా అమలు చేయడమే ఇందుకు కారణమన్నారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 219 మంది వామపక్షాలు మాత్రమే హత్యకు గురైతే, విష్ణు దేవ్‌సాయి ప్రభుత్వం హయాంలో కేవలం ఎనిమిది నెలల్లోనే వామపక్ష తీవ్రవాదులు నిరంతర ఎన్‌కౌంటర్‌లు, లొంగిపోవడం పెద్ద విజయంగా భావిస్తున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాదుల ఫ్రంట్‌లో శాంతిభద్రతలతో పాటు సుపరిపాలన విషయంలో ముఖ్యమంత్రి చేసిన కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు.

గత ఎనిమిది నెలల్లో విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం వామపక్ష ప్రాంతాల్లో 33 భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం ఇక్కడ గమనార్హమన్నారు. త్వరలో మరో 16 శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ భద్రతా శిబిరాల ద్వారా, పోలీసులకు మరియు స్థానిక ప్రజలకు మధ్య దూరం తగ్గిందని, దీని కారణంగా ప్రజా సంక్షేమ పథకాల అమలు కూడా మెరుగుపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌తో పాటూ, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ వంటి పొరుగు రాష్ట్రాల పోలీసు చీఫ్‌లతో సహా ప్రధాన కార్యదర్శులు, పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ తదితరులు పాల్గన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form