భారత్‌లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భారత టీనేజర్లలో దాదాపు సగం మంది విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారు! మెట్రోపోలిస్ హెల్త్ కేర్ నిర్వహించిన జాతీయ విశ్లేషణలో సగం మంది టీనేజర్లలో విటమిన్ డి లోపం ఉన్నట్టు కనుగొన్నారు.
2019 నుంచి జనవరి 2025 వరకు 22 లక్షల పరీక్షల ఫలితాలను ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఇందులో 46.5 శాతం మందిలో విటమిన్ డి లోపం ఉండగా, 26 శాతం మందిలో తగినంత స్థాయిలో ఈ విటమిన్ లేదు. ఎముకల ఆరోగ్యానికి, కండరాల శక్తికి, రోగ నిరోధక శక్తికి కీలకమైన డి విటమిన్ టీనేజర్లలో లోపించడం ఆందోళన కలిగిస్తోంది.























