ఢిల్లీ: భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించడంలో కీలకమైన మజుందార్‌కు అతడి నివాసం వద్ద ఘన స్వాగతం లభించింది. శాబ్దాలుగా అందకుండా ఊరిస్తున్న మెగా ట్రోఫీని పట్టేయడంలో కీలకమైన మజుందార్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విల్లే పార్లేలోని తన నివాసానికి మంగళవారం ఆయన వెళ్లగానే స్థానికులు అభినందల్లో ముంచెత్తారు. బ్యాండ్ బాజాలతో గులాబా రెమ్మలతో మజుందార్‌కు స్వాగతం పలికారు. కొందరు బ్యాట్లు చేతబూని అచ్చం క్రికెట్ మైదానంలో మాదిరిగా గార్డ్ ఆఫ్ హానర్‌తో ఆయనకు మర్చిపోలేని విధంగా వెల్‌కమ్ చెప్పారు. తనపై వాళ్లు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సంబురపడిపోయిన మజుందార్ కూల్‌గా నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.























