గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగి రూ.1.23 లక్షల మార్కు దాటిన బంగారం ధర నేడు మళ్లీ దిగొచ్చింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.710 మేర తగ్గి రూ.1,22,460కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధరలో రూ.650 మేర కోత పడి రూ..1,12,250కు దిగింది. వెండి ధర ఏకంగా రూ.3 వేల మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.1,51,000గా ఉం
హైదరాబాద్, విజయవాడల్లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా ఉంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,12,250గా ఉంది. రెండు నగరాల్లో వెండి రేట్ కిలోకు రూ.1,65,000 వద్ద కొనసాగుతోంది. మదపర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడం, ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై నానాటికీ సన్నగిల్లుతున్న ఆశలు, మళ్లీ పుంజుకున్న డాలర్ వెరసి బంగారం ధరలను తగ్గిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

				
				





















