జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా నలుగురు మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. టోంటో – గోయిల్‌కెరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. పోలీసు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరిని అరెస్టు చేసినట్లు జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి, ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోమ్‌కర్ పిటిఐకి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్‌కౌంటర్‌లో ఒక జోనల్ కమాండర్, ఒక సబ్-జోనల్ కమాండర్, ఒక ఏరియా కమాండర్‌తో సహా మరో నక్సల్స్ మరణించగా, చైబాసాలో ఒక ఏరియా కమాండర్‌తో సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు వారి నుండి రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.