బీజాపూర్: బీజాపూర్ జిల్లా గంగ్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడ్లా పుస్నార్ సమీపంలో మంగళవారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం.
ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువ మంది ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం అందడంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG)తో సహా భద్రతా దళాల సంయుక్త బృందం ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కాల్పుల సమయంలో, ఇద్దరు DRG సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్లు వారికి ప్రథమ చికిత్స అందించి, అధునాతన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు విమానంలో తరలించినట్లు అధికారులు తెలిపారు.
భద్రతా దళాల కాల్పుల్లో మావోయిస్టులు పెద్దమొత్తంలో గాయపడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆపరేషన్ సమయంలో సంఘటన స్థలం నుండి సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌తో సాటూ ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు, చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
