పాక్‌లో వ‌ర‌ద‌ బీభ‌త్సం…వందల్లో మృతులు

Published on 

ఉత్త‌ర పాకిస్థాన్‌లో వాన‌లు, వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. ఆక‌స్మిక వ‌ర‌ద‌ల వ‌ల్ల ఖైబ‌ర్ ఫ‌క్తున‌క్వా ప్రావిన్సులోని బునేర్ జిల్లాలో సుమారు 350 మందికి పైగా మ‌ర‌ణించారని సమాచారం. 200 మంది మిస్సింగ్‌లో ఉన్నారని అధికారుల అంచనా.

దేశ‌వ్యాప్తంగా కురుస్తున్న భీక‌రంగా వ‌ర్షాలతో అనేక న‌దుల్లో నీటి మ‌ట్టం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల భారీ న‌ష్టం జ‌రిగింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. బునేర్ జిల్లాలో 12 గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయ‌ని, 219 మంది మృత‌దేహాల‌ను రిక‌వ‌రీ చేసినట్లు అధికారులు తెలిపారు.

బుర‌ద‌, రాళ్ల కింద డ‌జ‌న్ల సంఖ్య‌ల మృత‌దేహాలు చిక్కుకున్నాయని, ఖైబ‌ర్ ఫ‌క్తున‌క్వా ప్రావిన్సులో ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లభించడం లేదని, శుధ్ద‌మైన నీరు, ఆహార కొర‌త ఉన్న‌ట్లు ఓ వాలంటీరు పేర్కొన్నాడు.

గ‌త ఏడాదితో పోలిస్తే వ‌ర్షాకాలం 50 నుంచి 60 శాతం అధికంగా ఉన్న‌ట్లు నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ ఏజెన్సీ తెలిపింది. 2022లో వ‌చ్చిన వ‌ర్షాల వ‌ల్ల మూడో వంతు దేశం నీట మునిగింది. అప్ప‌ట్లో సుమారు 1700 మంది మ‌ర‌ణించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form