హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు అయ్యింది. ఓ పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళల నకాబ్ తొలగించి పరిశీలించడం పట్ల హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రోనాల్డ్ రాస్ మాదవిలతపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను అదేశించారు.
ఓటర్లపై అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తనిఖీ చేయించవచ్చు కానీ స్వయంగా అభ్యర్తే నకాబ్‌ను తొలగించే అధికారం వుండదు. కానీ మాధవీలత ఓటర్ల గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులను పరిశీలించారు. పైగా అక్కడ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగినిపై కూడా మాధవీలత మండిపడ్డారు. అసలు ప్రభుత్వం తరపున వచ్చే ఉద్యోగులను నమ్మకూడదు అంటూ మాధవీలత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.