ఇంఫాల్: మణిపూర్‌లో చెలరేగుతున్న హింసను అరికట్టి శాంతిని నెలకొల్పేందుకు అదనపు కేంద్ర బలగాలను మోహరించారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సిఎపిఎఫ్)కి చెందిన మరో ఎనిమిది కంపెనీలు బుధవారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు చేరుకున్నాయని ఒక ఇఉన్నతాధికారి తెలిపారు.
ఇప్పటికే 11 CAPF కంపెనీలు మణిపూర్ కు చేరుకోగా. కొత్తగా మరిన్ని బలగాలను మోహరించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నాలుగు కంపెనీ చొప్పున శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాలలో మోహరించారు.