ఎట్టకేలకు కేరళను వీడిన బ్రిటన్‌ ఫైటర్‌ ఎఫ్-35

Published on 

బ్రిటన్ నౌకాదళానికి చెందిన సూపర్ ఫైటర్ జెట్ ఎఫ్-35 ఎట్టకేలకు కేరళను వీడింది. ఈ విమానం హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో జూన్ 14వ తేదీన తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. దాంతో సుమారు ఐదు వారాలుగా అది భారత్‌లోనే ఉండిపోయింది. తాజాగా తిరువనంతపురం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది.

ఈ ఫైటర్‌ జెట్‌కు ఇక్కడ మరమ్మతులు చేయడానికి వీలు కాకపోవడంతో బ్రిటన్‌ నుంచి నిపుణులను రప్పించారు. 24 మంది స్పెషల్‌ ఎక్స్‌పర్ట్స్‌ బృందం వచ్చి విమానానికి మరమ్మతులు చేపట్టింది. విమానంలోని లోపాలను సరిచేసింది. దీంతో విమానం ఎట్టకేలకు గాల్లోకి ఎగిరింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇవాళ ఉదయం కేరళ ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయ్యి బ్రిటన్‌కు బయల్దేరి వెళ్లింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form