హత్య కేసులో యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ శిక్ష రద్దు చేశారు. ఈ విషయాన్ని క్రైస్తవ మత ప్రచారకుడు, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఎ. పాల్ ప్రకటించారు. మంగవారం యెమెన్ రాజధాని సనా నుంచి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. నిమిష త్వరలో భారతదేశానికి తిరిగి వస్తారని అన్నారు. భారత ప్రభుత్వ అధికారులు, యెమెన్ నాయకులతో వరుసగా పది రోజులు పగలు, రాత్రి చర్చించి ఈ గొప్ప విజయాన్ని సాధించానని వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి, యెమెన్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
