బ్రిటన్‌లో స్థిరపడ్డ ప్రముఖ భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త మేఘ్‌నాథ్ దేశాయ్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు.
1940లో గుజరాత్‌లోని వదోదరలో జన్మించిన ఆయన 1963లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. రెండేళ్ల అనంతరం లండన్ వెళ్లారు. అక్కడి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో లెక్చరర్‌గా చేరారు. 1991లో లేబర్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో సభ్యునిగా నియమితులయ్యారు. 2009లో పద్మభూషణ్ అవార్డు అందుకున్న ఆయన ఆర్థికశాస్త్రంపై పలు పుస్తకాలు రాశారు. 2022లో ‘రాజకీయ ఆర్థిక వ్యవస్థ దారిద్య్రం’ పేరుతో చివరి పుస్తకం రాశారు.
