- మొత్తం మృతులు 128
- 63 మందికి గాయాలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- సహాయ చర్యల్లో రెస్క్యూ టీం
నేపాల్-టిబెట్ దేశాల సరిహద్దులను భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా ఇప్పటివరకు టిబెట్‌లో 53 మంది మరణించినట్టు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 63 మంది గాయాలపాలైనట్టు తెలిపింది. మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా వేసింది.
నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:35 గంటలకు ఈ భారీ భూకంపం సంభవించింది.
టిబెట్‌లోని షిజాంగ్ ప్రాంతంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రమైన టిబెట్‌లో భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భారీ భూకంపం తర్వాత టిబెట్‌లో మరో రెండు సార్లు ప్రకంపనలు వచ్చాయి. వాటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం టిబెట్‌లో సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శిథిలాల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారిని వెలికితీసేందుకు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.