తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Published on 

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జగ్గయ్యపేట, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, మంగళగిరి, చెన్నూరు, జైపూర్ మండలం, మంచిర్యాల, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో 2 సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి.. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

బుధవారం ఉదయం 7.20 గంటల నుంచి 7.27 గంటల ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form