Published on 

రష్యాలో భారీ భూకంపం

  • కంచట్కా ద్వీపకల్పంలో భూకంపం
  • 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి
  • జపాన్, అమెరికాలు సునామీ హెచ్చరికలు
  • ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదన్న అధికారులు

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రతను 8.7గా గుర్తించారు. భూకంపం వల్ల రష్యాలో ప్రాణ నష్టం జరగకపోయినా, తీర ప్రాంతాల్లో భవనాలు కంపించాయి. ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.

ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా, జపాన్‌ను సునామీ తాకింది.

పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హువాయి, జపాన్, అమెరికాలోని అలస్కా ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో సంభవించిన ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావం పసిఫిక్ మహాసముద్రంలోని తీరప్రాంతాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form