ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Published on 

ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపాన్ని భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం ఉదయం 9.43 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మిండనావో ద్వీపంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్‌ తీరంలో ఉన్న డావాయో ఓరియంట్‌లోని మానయ్‌ టౌన్‌కు సమీపంలో భూమి కంపించింది, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని ఫిలిప్పైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వోల్కనాలజీ అండ్‌ సీస్మొలజీ తెలిపింది.

భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, పసిఫిక్‌ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form