రాయన్‌ ప్రమోషన్స్‌ షురూ..

Published on 

ధనుష్‌ స్వీయదర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్‌’ విడుదలకు సిద్ధమైంది. ఈ పాన్‌ఇండియా చిత్రం జూన్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది ఆయన 50వ చిత్రం కావడంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు చిత్ర యూనిట్.

ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన తొలిపాటను శుక్రవారం మేకర్స్‌ విడుదల చేశారు. ‘తలవంచి ఎరగడే..’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్‌ రాయగా, ఏ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరిచారు. శరత్‌సంతోష్‌ ఆలపించారు.ధనుష్‌ ఓ ఉత్సవంలో కొందరు గ్రామస్థులతో కలిసి మాస్‌ డాన్స్‌ చేస్తూ ఈ పాటలో కనిపించారు.

సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్నఈ రాయన్ సినిమాలో సందీప్‌కిషన్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్‌.జె.సూర్య, సెల్వరాఘవన్‌, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందించగా ,ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించాడు. ఇది మాస్‌తో పాటు అన్ని వర్గాలకూ నచ్చే సినిమా ఇదని మేకర్స్‌ తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form