స్థానికులకే ఉప ఎన్నిక టికెట్టు: మంత్రి పొన్నం

Published on 

  • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై పొన్నం
  • అభివృద్ధి మంత్రమే కాంగ్రెస్‏ను గెలిపిస్తుందని వెల్లడి

TS: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నిక టికెట్టును స్థానికులకే కేటాయించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆశావాహులంతా కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 5లోని ఓ హోటల్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.

సర్వేల ద్వారా సరైన అభ్యర్థిని ఏఐసీసీ ఎంపిక చేస్తుందన్నారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‏కే పట్టం కట్టారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. పేదలకు వారు ఉంటున్న ప్రాంతాల్లోనే పక్కా గృహాలను నిర్మించేలా ఇందిరమ్మ మోడల్‌ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form