TG: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పలు విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్ చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ పెంచాలన్నారు.
కేంద్రం సహకరిస్తే..తెలంగాణ ట్రిలియన్ ఎకానమి సాధిస్తుందన్నారు. దేశం ఐదు ట్రిలియన్ల ఎకానమి సాధించడంలో…ట్రిలియన్ ఎకానమి అందిస్తుందన్నారు. తెలంగాణకు డ్రైపోర్టు ఇవ్వాలని ప్రధానిని కోరారు. అలాగే ట్రిపుల్ ఆర్ నిర్మాణం మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని కోరారు.