మళ్ళీ సీఎం కావాలనుంది: రేవంత్ రెడ్డి

Published on 

  • విద్యాశాఖను ప్రక్షాలన చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం
  • గత ప్రభుత్వం ఓయూ, కేయూలను నిర్లక్ష్యం చేసింది
  • ప్రతి మూలకు తెలంగాణ నినాధాన్ని చేరవేసింది టీచర్లే
  • ఐటీఐలను అధునీకరిస్తున్నాం
  • ఉపాధ్యాయులందరికీ త్వరలో పదోన్నతులు కల్పిస్తాం

హైదరాబాద్‌: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిలా రెండోసారి, మూడోసారి ముఖ్యమంత్రిని కావాలనే కోరిక వుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. శిల్పకళా వేదికలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని.. టీచర్ల సమస్యలను గాలికి వదిలేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం లాగా టీచర్లను చిన్నచూపు చూసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. టీచర్లతో కలిసి పనిచేస్తూ మళ్ళీ వాళ్లే అధికారంలోకి తీసుకొస్తారన్నారు. కేజ్రీవాల్ విషయంలో ఇదే జరిగిందన్నారు.

తెలంగాణకు వన్నె తెచ్చిన ఉస్మానియా యూనివర్శిటీ గతంలో మూతబడే పరిస్థితి ఏర్పడిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఓయూ, కేయూ పునరుద్ధరణలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు తెలంగాణ నినాధాన్ని చేరవేసింది టీచర్లేనని. కానీ గత ప్రభుత్వం పదేళ్లు టీచర్ల నియామకం చేపట్టలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ప్రైవేటు యూనివర్సీటీల ఏర్పాటుతో విద్యను వ్యాపారంగా మార్చారు.

తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపొందుతుందని పెద్దలు చెప్పారని, ప్రపంచ దేశాలతో మన విద్య పోటీపడేలా విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతామన్నారు. నియోజక వర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని, కార్పోరేట్ కంపెనీల సలహాలు, సూచనలతో ఐటీఐలను అధునీకరిస్తున్నామని, ఇందుకోసం టాటా వంటి ప్రఖ్యాత సంస్థల సహాకారంతో రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్సు టైనింగ్ సెంటర్లుగా మార్చి వాటి పనితీరును మెరుగుపరుస్తున్నామన్నారు.

చాలామంది ముఖ్యమంత్రులు ఫైనాన్స్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను తమ దగ్గర పెట్టుకుంటారు. కానీ తాను విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు తెలిపారు. అత్యంత వివాదాస్పద శాఖ విద్యా శాఖ. అది తన దగ్గర పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన అని అందుకే దానిని తాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొంత మంది అవగాహన రాహిత్యంతో ఈ శాఖకు మంత్రిని పెట్టమని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. విమర్శలకు ఒకటే మాట చెప్తున్నా ఈ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే దీనిని తన దగ్గర పెట్టుకన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

టీచర్లకు కేవలం జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని తమ ప్రభుత్వానికి తెలుసని అందుకే 120 టీచర్లను బెస్ట్ టీచర్లుగా ఎంపిక విదేశాలకు పంపించీ అక్కడి విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడానికి పంపిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను పెంచామని గుర్తుచేశారు.

ఉపాధ్యాయులకు ప్రశంసలు..!

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పాత్రను ప్రశంసించారు. ఉపాధ్యాయ వృత్తి సమాజానికి అత్యంత కీలకమైందని, విద్యార్థులకు మార్గదర్శనం చేస్తారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తామని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని అన్నారు. అర్హులైన ఉపాధ్యాయులందరికీ త్వరలో పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించారు. స్పీచ్ అనంతరం ప్రతిభ చాటిన పలువురు ఉపాధ్యాయులను సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఎంపీ కేశవరావు, వివిద యూనివర్సటీల వైస్ ఛాన్స్ లర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form