ఊహించని చిక్కుల్లో అఘోరీ..!

Published on 

TS: విచిత్ర చేష్టలతో సామాజిక మాధ్యమాల్లో చర్చగా మారిన నాగసాధు అఘోరీ ఊహించని చిక్కుల్లో చిక్కుకుంది. ఆమెపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాముననూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

నవంబర్ 19వ తేదీన అఘోరీ వరంగల్ నగర శివారులోని బెస్తం చెరువు స్మశాన వాటికలో రెండు రోజులపాటు విడిది చేసింది. అక్కడ స్మశాన వాటికలో విచిత్ర పూజలు నిర్వహించి బహిరంగంగా కోడిని బలి ఇచ్చింది. కోడిని చంపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అఘోరీ పూజలు జనాన్ని తీవ్ర భయాందోళన గురిచేశాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే యువకుడు అఘోరీపై మామునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బహిరంగంగా కోడిని బలిచ్చి రక్తార్పణ చేయడం నేరమని పోలీసులు 325 BNS 11(1)(A) PCCA సెక్షన్లలో కేసులు నమోదు చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form