అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని ఆర్వో ఫిర్యాదు మేరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై, అలాగే వైసీపీ అభ్యర్ధి శిల్ప రవిచంద్ర రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
నంద్యాల స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవి మద్దతుగా ఇవాళ సీని నటుడు అల్లు అర్జున్, తన భార్య స్నేహతో నంద్యాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను చూడటానికి వేలాది మంది తరలివచ్చారు.
అయితే ఇదే విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు స్పందిస్తూ ‘‘నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు జనసేన జెండాలు పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ జెండాలు పట్టుకొని చీకటి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు కావడం చర్చకు దారితీసింది.