ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా మొదలైనా చాలా కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. రెండు ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు రెడ్ మార్క్‌పై మారాయి. దీంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా తగ్గి 83,750 దగ్గర ఉండగా.. నిఫ్టీ కూడా దాదాపు 70 పాయింట్లు తగ్గి 25,650 వద్ద ట్రేడవుతోంది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 19 క్షీణించగా, 11 లాభాలను ఆర్జించాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ స్టాక్‌లు క్షీణించగా.. ఫార్మా, రియాలిటీ స్టాక్‌లు కొనుగోళ్లను చూశాయి. బ్రోకరేజ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ గ్రో యొక్క IPO ఈరోజు ప్రారంభమైంది. బీఎస్ఈలో భారతీ ఎయిర్ టెల్, టైటాన్, రిలయన్స్, అదానీ పోర్ట్ సన్ ఫార్మాలు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. సవర్ గ్రిడ్, ఎటర్నల్, మారుతి, హెచ్‌సిఎల్ టెక్ లు కింద చూపులు చూస్తున్నాయి.
మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్..
ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ ఇండెక్స్ 0.096% తగ్గి 52,361 వద్ద, కొరియా కోస్పి 1.59% తగ్గి 4,154 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.21% పెరిగి 26,213 వద్ద, చైనాకు చెందిన షాంఘైకాంపోజిట్ 0.19% తగ్గి 3,969 వద్ద ట్రేడవుతున్నాయి. అలాగే నవంబర్ 3న, US డౌ జోన్స్ 0.48% తగ్గి 47,336 వద్ద ముగిసింది. అదే సమయంలో, నాస్‌డాక్కాంపోజిట్ 0.46%, S&P 500 0.17% పెరిగాయి. నవంబర్ 3న ఎఫ్‌ఐఐలు రూ.1,686 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డిఐఐలు రూ.3,273 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

				
				





















