కవితపై వేటు..బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ

Published on 


బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కవిత గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని అందులో భాగంగానే కవిత ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

ఈ క్రమంలో నిన్న అమెరికా నుంచి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కవిత షాకింగ్ విషయాలు వెల్లడించారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావులపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడా కేటీఆర్, హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form