దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న ఢిల్లీ హోం మినిస్ట్రీ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం సంచలనంగా మారింది. నార్త్ బ్లాక్ వద్ద బాంబు ఉందని పోలీస్ కంట్రోల్ రూమ్ కు మెయిల్ వచ్చింది. దీంతో హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో భద్రతా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బాంబు బెదిరింపు రావడంతో నార్త్ బ్లాక్ కు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అధికారులు డాగ్ స్వ్కాడ్, డిస్పోజల్ స్వ్కాడ్ ను రంగంలోకి దింపి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మెయిల్ ఎవరు పంపించారు అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న ఇప్పటికే రాజస్థాన్, హర్యాన తదితర ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు మెయిల్స్ రావడం సంచలనంగా మారింది. స్కూళ్లు, ఎయిర్ పోర్టులు సహా పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఈ మెయిల్స్, ఫోన్ కాల్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖకే బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో ఈ అంశం తీవ్ర కలకలం రేపుతోంది.