యెమెన్లో ఘోరం విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గల్లంతు అయ్యారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం 154 మంది వలసదారులతో వెళుతున్న బోటు యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా సముద్రంలో బోల్తాపడింది. దీంతో 154 మంది నీటిపై పడిపోయారు. కేవలం 12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన అందరూ నీటిలో కొట్టుకుపోయారు. 54 మంది శవాలు ఖాన్ఫర్ జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకు వచ్చాయి. ఆ శవాలను మార్చురీకి తరలించారు. మిగిలిన 74 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
