ఢాకా: వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం ఉదయం ఢాకాలోని ఓ స్కూలు భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తాజా సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 27కు పెరిగింది. వారిలో 25 మంది చిన్నారులు కాగా, ఇద్దరు టీచర్లు. మరో 171 మంది గాయపడ్డారు. ‘శిక్షణ విమానం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 27కి చేరింది. వారిలో 25 మంది విద్యార్థులే’ అని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ సలహాదారు సైదుర్ రెహమాన్ తెలిపారు.
క్షతగాత్రులను నగరంలోని ఆరు దవాఖానాలకు సహాయక సిబ్బంది తరలించారు. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఎస్-7 శిక్షణ విమానం ఢాకాలోని ఉత్తరలో కూలిపోయిందని, మధ్యాహ్నం 1.06 గంటలకు విమానం టేకాఫ్ అయిందని సైన్యానికి చెందిన ప్రజా సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
