కాశ్మీరీ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్‌కు శ్రీనగర్‌లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 10న శ్రీనగర్‌లోని NIA కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసిందని ఆసిఫ్ సుల్తాన్ తరపు న్యాయవాది ఆదిల్ పండిట్ ది తెలిపారు.
ఆసిఫ్ సుల్తాన్‌ను అతని శ్రీనగర్ నివాసంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు అనే కారణంతో ఆగస్టు 2018లో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ నాటికి కశ్మీర్ నుండి వెలువడే ’కశ్మీరీ నారేటివ్’ అనే ఆంగ్ల పత్రికలలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. జులై 8, 2016లో బుర్హన్ వని మరణం తర్వాత తను పనిచేస్తున్న పత్రికలో బుర్హన్ వని మరణంపై ప్రత్యేక కథనాన్ని రాశాడు. ఒక తిరుగుబాటుదారుడు తన మరణాంతరం ఎందుకు ప్రమాధకరంగా మారాడు అంటూ ప్రశ్నలు లేవనెత్తాడు. బుర్హాన్ వని మరణాంతరం ఎక్కువమంది కశ్మీరీ యుతవ అడవుల్లోకి అదృశ్యమవుతున్నారనీ రాశాడు.
సహజంగానే జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్ లేవనెత్తిన ప్రశ్నలు కాశ్మీర్‌లోని పోలీసు యంత్రాంగానికి కోపం తెప్పించాయి. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు ఆగస్ట్ 12, 2018న శ్రీనగర్‌లోని బటామలూ ప్రాంతంలో తిరుగుబాటుదారులకు , భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక పోలీసు మరణించగా ముగ్గురు తిరుగుబాటుదారులు తప్పించుకోగలిగారు. ఈ ఘటన తర్వాత తిరుగుబాటు దారులకు తన ఇంట్లో ఆశ్రమం కల్పించాడనే సాకుతో ఆసిఫ్ సుల్తాన్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా), జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు.
2022లో ఆసిఫ్ సుల్తాన్ కు బెయిల్ మంజూరు అయినప్పటికీ విడుదలకు ముందే అతనిని PSA కింద మళ్లీ నిర్భంధించారు. అయితే మే 10న NIA ప్రత్యేక న్యాయమూర్తి సందీప్ గండోత్రా ‘పోలీసులు సుల్తాన్‌ను అ కారణంగా అరెస్ట్ చేశారని, అతను నిర్దోషి అని, ఎలాంటి నేరం చేయలేదు” అంటూ బెయిల్ మంజూర్ చేశారు.