మీరు ఎక్కువ సమయం నిద్రపోతున్నారా? అయితే మీ గుండె పదిలం అంటున్నారు వైద్య పరిశోధకులు. పడుకునే సమయంలో మార్పులు సంభవిస్తే నేరుగా గుండెపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. మరి సరైన నిద్ర లేకపోవడం వల్ల నష్టాలు ఏంటి.? గుండెకు ఎలాంటి సమస్యలు వస్తాయి.? ఈ స్టోరీలో మనం తెలుసుకుందామా మరి.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా పరిశోధకులు నిద్ర, గుండె పనితీరుపై పరిశోధనలు జరిపారు శాస్త్రవేత్తలు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం 7 గంటల నుంచి 9 గంటల వరకు నిద్ర పోవాల్సిందేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్య రాత్రిలో ఎక్కుసార్లు మెలకువ వచ్చినా, నిద్రవేళలో చిన్నపాటి తేడా వచ్చినా గుండె అనారోగ్య సమస్యలు ఖాయం! అంటున్నారు ఈ పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు. అందుకే టైం ప్రకారం నిద్ర అవసరం. మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా మంచి నిద్ర అవసరం అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తాజాగా 35 మంది ఆరోగ్యంగా ఉన్న మహిళలపై 12 వారాలపాటు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. నిద్ర సమయంలో మార్పులు రావడం వల్ల వీరి గుండె ఆరోగ్యంపై ప్రభావం పడినట్లు గుర్తించారు యూనివర్సిటీ పరిశోధకులు. NHS సంస్థ అధ్యయనం ప్రకారం కూడా ప్రతి ఒక్కరికీ రోజుకు 7 గంటల నుంచి 9 గంటల పాటు నిద్ర అవసరమని చెబుతున్నారు. సో.. తెలిసింది కదా. మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అలవాటు చేసుకోవడం ఉత్తమని అంటున్నారు నిపుణులు. లేదంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సరైన నిద్ర అవసరం.
