- తాజాగా పాక్‌లోని కీలక నగరాలపై భారత్ దాడి
- పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం
- పాక్‌లో రూ.1600 కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసం
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఒకరిపై ఒకరు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ఈ మేరకు పాక్‌లోని తమ పౌరులు, దౌత్యవేత్తలను అప్రమత్తం చేసింది. వెంటనే లాహోర్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు లాహోర్‌లోని యూఎస్ ఎంబసీ సూచనలు జారీ చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంగా కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా పాక్‌లోని కీలక నగరాలపై దాడి చేస్తోంది. లాహోర్, సియాల్‌కోట్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి వంటి ప్రధాన నగరాలపై డ్రోన్లతో విరుచుకుపతోంది. భారత్ దాడుల్లో పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకూ రూ.1600 కోట్ల విలువైన ఆస్తులను భారత్ ధ్వంసం చేసినట్లు సమాచారం.
