కిమ్స్ లో శ్రీతేజ్ కు అల్లు అర్జున్ పరామర్శ

Published on 

Hyderabad: సినీ నటుడు అల్లు అర్జున్ బేంగపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఆ తర్వాత శ్రీతేజ్ తండ్రిని కలిసి మాట్లాడారు. అలాగే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కోలుకునేందుకు మరికొంత సమయం పడుతోందని డాక్టర్లు అల్లు అర్జున్‌కు వివరించారు.

రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా.. శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form