మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకులంతా జైల్లోనే : కేజ్రీవాల్

Published on 

తీహార్ జైలు నుండి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, “ప్రధాని మోదీ ఎన్నికల్లో గెలిస్తే, ప్రతిపక్ష నాయకులందరినీ కటకటాల వెనుక్కి పంపి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మమత, స్టాలిన్, ఉద్ధవ్ సహా విపక్ష నేతలందరూ జైలులో ఉంటారన్నారు.

మా పార్టీని అణిచివేయడానికి దేన్నీ వదిలిపెట్టలేదనీ, ఒక్క సంవత్సరంలోనే నలుగురు అగ్రనేతలను జైలుకు పంపారని ఇది 75 ఏళ్ల కాలంలో ఏ పార్టీని ఈ స్థాయిలో వేధించలేదని విమర్శించారు. తన పార్టీలోనే అవినీతి పరులను పెట్టకొని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం గురించి చెబుతున్నాడని ఎద్దేవ చేశాడు. నిజంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటనుకుంటే అది తనను చూసి నేర్చుకోవాలని సవాళు విసిరారు కేజ్రీవాల్. అవినీతిపరులను జైలుకు పంపాం’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నా మంత్రుల్లో ఒకరిని తొలగించి జైలుకు పంపాను. పంజాబ్‌లో ఓ మంత్రిని పంపాం. ఇది అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం అంటే అని అన్నారు. మీరు దొంగలందరినీ మీ పార్టీలో చేర్చుకుని, కేజ్రీవాల్‌ను జైలుకు పంపండం అవినీతిపై పోరాటం ఎలా అవుతుందన్నారు.

కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా ఎవరినైనా అరెస్టు చేస్తామని వారు సందేశం ఇస్తున్నారన్నారు. “నేను జైలులో ఉన్నప్పుడు, కొంతమంది అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సిఎం పదవికి ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. నేను సిఎం లేదా పిఎం కావడానికి రాలేదు… గత 75 ఏళ్లలో ఎన్నికలు జరిగాయి. అత్యంత చారిత్రాత్మకమైన మెజారిటీతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటైంది, ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ మెజారిటీతో ఏ రాజకీయ పార్టీ గెలవలేదు. ఇక ఆప్‌ని ఎప్పటికీ ఓడించలేమని వారికి తెలుసు కాబట్టి కేజ్రీవాల్‌ను జైలుకు పంపేందుకు కుట్ర పన్నారు.. ప్రభుత్వం పడిపోతుంది కానీ మేము వారి ఉచ్చులో పడలేదన్నారు. నేనే కాదు హేమంత్ సోరెన్ కూడా రాజీనామా చేయకూడదు ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form