హైదరాబాద్: అదిలాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ను ఎంపిక చేసింది.
ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టును సమర్పించింది. AAI రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్‌లో ఎయిర్పోర్ట్ సాధ్యమని సూచించింది. ఈ మేరకు భూమి స్వాధీన ప్రక్రియ ప్రారంభించాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 700 ఎకరాల భూమిని జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ కోసం సేకరించనున్నారు.

				
				





















