ఢిల్లీ: కారుబాంబు కేసులో ఫతేపూర్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఇమామ్‌గా పనిచేస్తున్న మొహమ్మద్ ఇషిత్యాక్‌ను జాతీయ భద్రతా అధికారులు బుధవారం నాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టుపై ఇషిత్యాక్ సోదరుడు మొహమ్మద్ షహబాద్ ఆందోళన వ్యక్తం చేశాడు. తన సోదరుడు వైట్ కాలర్ టెర్రరిస్టు అంటే సంబంధం లేేని కేసులో ఇరికించే ప్రయత్నం చేేస్తున్నారని ఆరోపించాడు.

జాతీయ మీడియ సంస్థ అయిన ఏఎన్ఎ (ANI) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, షహబాద్ మాట్లాడుతూ, “నా సోదరుడు గత 20 సంవత్సరాలుగా అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలోని ఆ మసీదుకు ఇమామ్‌గా ఉన్నాడు. అతని వివాహానికి ముందు నేను అతన్ని అక్కడ నియమించాను. అతను కుటుంబం అక్కడే నివసిస్తున్నాడు. మేము తరచుగా ఒకరినొకరు కలుస్తూనే ఉంటాము. ఇషిత్యాక్ ఫతేపూర్‌లో ఇమామ్‌గా పనిచేస్తునే వచ్చిన డబ్బులతో ఒక భూమిని కొని అద్దెకు గదులు నిర్మించాడు. ఆ గదుల్లో ఒకదాన్ని ఈ వైద్యుడు (ముజమ్మిల్) అద్దెకు తీసుకున్నాడని తెలుస్తోంది. అతను ఆ గదిని ఎప్పుడు అద్దెకు తీసుకున్నాడో మాకు తెలియదు.” అన్నాడు.
“అద్దెకు దిగిన వ్యక్తికి సంబంధించిన రోజువారీ కార్యకలాపాలను ఎవరూ గమనించరు. అద్దె వసూలు చేయడానికి మాత్రమే మేము మా అద్దెదారులను సందర్శిస్తాము. ఆ అద్దెదారుడి గది నుండి ఆయుధాలు,పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు మీడియా ఇప్పుడు చెబుతోంది. నా సోదరుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా తప్పు. నా కుటుంబంపై గతంలో ఎప్పుడూ ఇటువంటి ఆరోపణలు లేవు. నా సోదరులందరూ ఇమామ్‌లే.” అని తెలిపాడు.























