ఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా చేశారు. అదే విధంగా ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు.
అయితే రాజీనామా చేసిన ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆప్ టిక్కెట్లను నిరాకరించింది. దీంతో ఎన్నికల పోటీలో లేని ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా చేశారు. అయితే వారు ఏ పార్టీలో చేరుతారో అన్నది స్పష్టం కాలేదు. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఢిల్లీ రాయకీయాల్లో ఆసక్తిగా మారాయి.