పాతబస్తీకి కొత్త శోభ.. దీప కాంతుల్లో చార్మినార్

Published on 

Hyd: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో హైదరాబాద్ నగరం కొత్త శోభ సంతరించుకుంది. మరీ ముఖ్యంగా రంజాన్ అంటేనే పాతబస్తీ ప్రాంతానికి పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తుండడం, చార్మినార్, మక్కా మసీదు లాంటి చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడే ఉండడంతో రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు.. ఎక్కడ లేని జనసందోహం పాతబస్తీలోనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రంజాన్ మాసం వేడుకల్లో పాతబస్తీ ప్రాంతం రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది.

పాతబస్తీలో రంజాన్‌ సందడి కొనసాగుతోంది. రంజాన్ మాసంలో చార్మినార్ సందర్శకులు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో చార్మినార్ చుట్టు పక్కల ప్రాంతాలు రాత్రయితే చాలు ధగధగ మెరిసిపోతున్నాయి. విద్యుత్ దీపకాంతుల్లో చార్మినార్ కట్టడాన్ని చూస్తుంటే కనుచూపు తిప్పుకోలేం అసలు. అంత అందంగా మెరిసిపోతోంది. పాతబస్తీ ప్రాంతంలో రాత్రంతా షాపింగ్, ఫుడ్స్‌ టేస్ట్ చేస్తూ నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చీపోయే సందర్శకుల కారణంగా రద్దీ పెరిగిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నెలంతా ప్రజల క్షేమం కోసం గస్తీ కాస్తున్నారు. పవిత్ర మాసంలో అర్ధరాత్రి వరకు సందర్శకుల రాక ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బలగాలు రక్షణగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో చార్మినార్ అందాలను చూడడానికి ఎక్కువ మంది వస్తుండడంతో అవసరమైన ఏర్పాట్లన్నీ చేశామని పాతబస్తీ పోలీసులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form