మారేడుమిల్లి ఎన్కౌంటర్ స్థలానికి నిజ నిర్ధారణ కోసం ఈరోజు తెల్లవారుజామున వెళ్లిన యూనివర్సిటీ విద్యార్ధులను తెలంగాణ,ఆంధ్ర సరిహద్దు వద్ద అడ్డగించిన పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసు స్టేషన్లో నిర్భందించిన విషయం తెలిసిందే.
మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం మావోయిస్టు దళాలు తచ్చాడుతున్నాయనే సమాచారం వుండటంతో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుందని, ఈ పరిస్థితిలో విద్యార్ధులను అటువైపు వెళ్లనివ్వడం లేనట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
మవోవైపు మారేడు మిల్లి వెళ్లే దారిలో అనేక చోట్లు మావోయిస్టు బాధిత గ్రామస్తులు నిజనిర్దారణ బృందాన్ని అడ్డుకునే అవకాశం వుందనే సమాచారంతో విద్యార్ధులను వెనక్కి పంపుతున్నట్లు చింతూరు ఎస్సై తెలిపారు. రెండు పోలీసు ఎస్కార్ట్ వాహనాలతో సరిహద్దును దాటిస్తున్నట్లు తెలిపారు. అయితే భద్రాచలం వరకూ విద్యార్ధుల వాహనం వెంట రెండు పోలీసు వాహనాలు వచ్చే అవకాశం వున్నట్లు విద్యార్ధి నాయకులు తెలిపారు.























