హైదరాబాద్: బాచుపల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో విషాదం చోటుచేసుకున్నది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన వర్షిత (16) శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. తానుంటున్న హాస్టల్ గదిలో వర్షిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
విషయాన్ని గమనించిన హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.























