బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని అన్నారం-మారిమళ్ల అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నది.
బుధవారం ఇదే ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారుం ఉదయం జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.























