బీహార్‌ ఎన్నికలు..ఓటేసిన ప్రముఖులు

Published on 

పాాట్నా: బీహార్‌ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ (గురువారం) పోలింగ్‌ జరుగుతోంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న మిగితా 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ జరుగనుంది. ఈ నెల 14న ఫలితాలను వెల్లడించనున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు: బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ ఆయన భార్య రబ్రీదేవి, మహాగఠ్‌బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌, కేంద్రమంత్రులు, రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, గిరిరాజ్‌ సింగ్‌, నిత్యానంద్‌ రాయ్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హా తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form