AP: వైసీసీ చీఫ్, మాజీ సీఎం జగన్ కృష్ణ జిల్లా పర్యటనలో ఉన్నారు. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఇటీవల సంభవించిన ‘మోంథా’ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించి, నష్టపోయిన రైతులతో మాట్లాడి పరామర్శించనున్నారు. అయితే ఆయన పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అయితే జగన్ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరగకపోవడంతో ఆయన సురక్షితంగా ఉన్నారు.కాగా తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాల్లోని పలు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో ఆయన పర్యటన సాగనుంది. మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు కృష్ణా జిల్లాలో కఠిన ఆంక్షలు విధించారు.కేవలం 500 మందికి, 10 వాహనాలకు మాత్రమే పర్యటనలో అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా టూ వీలర్స్ పూర్తిగా నిషేధం విధించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్. గొల్లపాలెం వంటి నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే పర్యటన జరపాలని పోలీసులు షరతులు విధించారు. న్ని ప్రాంతాల్లో జగన్కు స్వాగతం పలికేందుకు భారీగా వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు రోప్ వేసి నిలువరించడంతో, పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.























