చేవెళ్ల ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి!

Published on 


ఢిల్లీ:
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదే సమయంలో ప్రధాని సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు.

ఈ సందర్భంగా వేదికగా ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(PMNRF) నుంచి మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సహాయం) అందించబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 చెల్లించబడుతుంది’ అని ట్వీట్ చేశారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం మీర్జాగూడ బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form