అమరావతి: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం, మంత్రి తెలిపారు.
కలచివేసింది: చంద్రబాబు
‘తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.























