- నామినేషన్ ప్రారంభం రోజే ఎన్నికలకు బ్రేక్
- నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి
- తదుపరి విచారణ నాలుగు వారాల సమయం
Hyd: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల అంశంపై విచారణను నాలుగువారాలు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. బీసీ రిజర్వేషన్లపై రెండురోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ విలువడిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌పై సైతం హైకోర్టు స్టే విధించింది. దాంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనున్నది.
