హైదరాబాద్: జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఎడతెరపి వాన (Heavy Rain) కురుస్తున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, ఫిల్మ్ నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, కుత్బుల్లాపూర్, చింతల్ సాయినగర్‌లో తోపాటు నగరంలో అక్కడక్కడ భారీ వాన పడుతున్నది. వర్షాలతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
కాగా, మరో వైపు కామారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెళ్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.
