సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు గ్రామస్తులను నక్సలైట్లు హత్య చేసినట్లు మంగళవారం స్థానిక పోలీసులు తెలిపారు. మృతులు పదమ్ పోజ్జా, పదమ్ దేవేంద్రగా గుర్తించారు. వారు పోలీసు ఇన్‌ఫార్మర్లుగా భావించి మావోయిస్టులు హత్యచేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కేర్ల పాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిర్సట్టి పంచాయతీలోని నందా పారాలో జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ కేసును తీవ్రంగా పరిగనిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇటీవల, బీజాపూర్ లోని సిల్గర్‌లో ఇద్దరు తాత్కాలిక టీచర్లను దారుణంగా హత్య చేయడంతో ఆ ప్రాంతంలో ఇప్పటికే భయానక వాతావరణం నెలకొంది. సంవత్సరం కాలంలోనే ఇప్పటివరకు 9 తాత్కాలిక టీచర్లను నక్సల్స్ చంపినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 5 మంది బీజాపూర్ జిల్లాలో, 4 మంది సుక్మా జిల్లాలో హత్యకు గురయ్యారు. అన్ని హత్యల్లోనూ, నక్సలైట్లు వారిని ఇన్ఫార్మర్లుగా ఆరోపిస్తున్నారు. హత్యల వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు జరుగుతోందని. స్థానిక ప్రజలు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
