మ‌ణిపూర్‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టన

Published on 

న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈనెల 13వ తేదీన మ‌ణిపూర్‌లో ప‌ర్య‌టించే అవ‌కాశాలు ఉన్నాయని ఐజ్వాల్‌లోని అధికారులు వెల్ల‌డించారు. తొలుత ఆయ‌న మిజోరంలో ప‌ర్య‌టిస్తార‌ని అధికారులు తెలిపారు. బైరాబి-సైరంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించేందుకు ఆయ‌న మిజోరం వెళ్తారు. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న యాక్ట్ ఈస్ట్ పాల‌సీలో భాగంగా 51.38 కిలోమీట‌ర్ల పొడువైన రైల్వే లైన్‌ను నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో క‌నెక్టివిటీ పెంచేందుకు ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేప‌ట్టారు. అస్సాంలోని సిల్చార్ ప‌ట్ట‌ణం నుంచి కొత్త రైల్వే లైన్‌కు ఐజ్వాల్‌తో లింక్ అవుతుంది.

2023 మే నెల‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య మ‌ణిపూర్‌లో ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన విష‌యం తెలిసిందే. విధ్వంస‌క‌రంగా మారిన ఆ ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం .. మజోరం, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. కానీ ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు చెందిన తుది షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేద‌న్నారు. ఇంపాల్‌లో ఉన్న అధికారులు మాత్రం మోదీ టూరు గురించి ఎటువంటి క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌లేదు.

మిజోరం చీఫ్ సెక్ర‌ట‌రీ ఖిల్లి రామ్ మీనా వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌ధాని మోదీ రాక కోసం భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. సెక్యూర్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రిసెప్ష‌న్‌, స్ట్రీట్ డెక‌రేష‌న్ లాంటి అంశాల‌పై చ‌ర్చించారు. ఐజ్వాల్ స‌మీపంలోని లామౌల్‌లో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form