బెంగళూరు: వాహనదారులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు అతి క్రమించిన వాహనదారులకు గతంలో విధించిన చలానాల్లో చెల్లించే రుసుంను భారీగా తగ్గించినట్లు వెల్లడించారు. చెల్లించాల్సిన రుసంలో సగం.. అంటే 50 శాతం నగదు చెల్లిస్తే సరిపోతుందని వాహనాదారులకు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ గడువు ఆగస్ట్ 23వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఈ చలానాలు చెల్లించ వచ్చని వివరించారు.
నగరంలోని వాహనదారులకు జరిమాన భారం నుంచి ఉపశమనం కలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అంతేకాదు.. ఈ చెల్లింపులను క్రమబద్దీకరించు కోవడంతోపాటు చట్టపరమైన సహాయాన్ని నివారించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
