సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ప్రమాదం చోటు చేసుకుంది. సిమ్లాలో ఓ కారు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు చిర్గావ్ ప్రాంతానికి చెందిన విశాల్ థాకూర్, అభ్య కందియాన్, హిమాన్షుగా గాయపడిన వ్యక్తిని హర్ష్ చౌహాన్గా గుర్తించారు. నది నుంచి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిర్గావ్ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు అదుపుతప్పి పబ్బర్ నది లోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.
